Kishan Reddy: అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Union Minister Kishan Reddy is Called by the Party High Command
x

Kishan Reddy: అధిష్ఠానం నుంచి పిలుపు.. ఢిల్లీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Highlights

Kishan Reddy: మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లనున్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలోనే ఉండటంతో... తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కూడా ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న కిషన్‌రెడ్డి.. ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఈటల, రాజగోపాల్‌రెడ్డితో నిర్వహించనున్న భేటీలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని ఢిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories