Top
logo

జీహెచ్ఎంసీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది : కిషన్ రెడ్డి

జీహెచ్ఎంసీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది  : కిషన్ రెడ్డి
X
Highlights

బీజేపీ జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంబర్ పేట్, బాగ్ అంబర్ పేట్, హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు.

బీజేపీ జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంబర్ పేట్, బాగ్ అంబర్ పేట్, హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థుల ఎన్నికల కార్యాలయాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. గత ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సహా అనేక వాగ్ధానాలు చేసి గెలుపొందిన టీఆర్ఎస్.. వాటిని అమలు పరచడంలో విఫలమైందన్నారు. ఇక రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేశామంటున్నారు.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేరా? అని ప్రశ్నించారు. కనీసం ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలేకపోయరని అన్నారు. ప్రస్తుతం బీజేపీ మీద విశ్వాసంతో అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని, గ్రేటర్ యువత బీజేపీని గెలిపించబోతున్నారని వ్యాఖ్యానించారు.

Web TitleUnion minister Kishan reddy confident on Win the GHMC Elections 2020
Next Story