Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

Union Minister Bandi Sanjay open letter to CM Revanth Reddy
x

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

Highlights

Bandi Sanjay: రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను టీచర్లకు అప్పగించడం సరికాదు

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన... కొత్త టైమ్‌ టేబుల్ పనివేళలను కుదించాలని లేఖలో పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9.30 వరకు పనివేళలు రూపొందించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమన్న బండి సంజయ్.. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం.. కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడమేంటన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories