ఖమ్మం జిల్లా కుప్పెనకుంట్లలో విషాదం... ఈతకెళ్లిన ఇద్దరు యువకులు సాగర్ కాలువలో గల్లంతు..!

* గల్లంతైన యువకులకోసం ఈతగాళ్ల సాయంతో గాలింపు

R Tripura Malini
Published on: 20 Nov 2022 7:04 AM IST
two youths who went swimming drowned in the sagar canal
X

ఈతకెళ్లిన ఇద్దరు యువకులు సాగర్ కాలువలో గల్లంతు..!

Missing: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ఇద్దరి యువకులు సాగర్ కాలువలో గల్లంతయ్యారు. ఈతకు వెళ్లిన తల్లపురెడ్డి నరేందర్ రెడ్డి, ఆవులూరి నాగ నరేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి తుమ్మలపల్లికి సమీపంలో ఈతకెళ్లి నీటమునిగారు. కాలువగట్టుపై బట్టలు, మోటారుసైకిల్‌ను బ్టటి కాలువలో గల్లంతైన విషయాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈతగాళ్ల సహాయంతో గల్లంతయిన యువకులకోసం సాగర్ కాలువలో గాలింపు చేపట్టారు. తల్లపురెడ్డి నరేందర్ రెడ్డి హైదరాబాదులో బీటెక్ చదువుతున్నాడు. తండ్రి అయ్యప్ప ఇరుముడి కార్యక్రమం ఉండటంతో హైదరాబాద్ నుండి ఇంటికి చేరుకున్నాడు. మరో యువకుడు నాగ నరేందర్ రెడ్డి సత్తుపల్లి లోని కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి ఇరుముడి పూజ కార్యక్రమం అనంతరం సరదాగ ఈతకు వెళ్ళిన ఇద్దరు యువకులు కాలువలో గల్లంతు కావడంతో కుప్పెనకుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story