Nizamabad: నీటిగుంతలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

Two Kids From Nizamabad Drowned In Pond
x

Nizamabad: నీటిగుంతలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

Highlights

Nizamabad: 15 రోజులు అవుతున్నా రక్షణ ఏర్పాట్లు చేయలేదని గ్రామస్తుల ఆరోపణ

Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్‌లో విషాదం చేటు చేసుకుంది. నీటి గుంతలో పడి చరణ్, నాస్తిక్ అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీడీసీ భవనం నిర్మాణం కోసం గుంతలు తవ్వగా...అందులో వరదనీరు చేరింది. ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆ గుంతలో పడి మృత్యువాత పడ్డారు. గ్రామ కమిటీ భవనం కోసం భవనం కోసం గుంతలు తవ్వి 15 రోజులవుతున్నా..రక్షణ ఏర్పాట్లు చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. రక్షణ ఏర్పాటు చేయకపోవడంతోనే చిన్నారులు మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories