ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలం..సమ్మె యధాతథం

ఆర్టీసీ చర్చలు మళ్లీ విఫలం..సమ్మె యధాతథం
x
Highlights

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రేపటి నుంచి యథాతధంగా జరగనుంది. ఐఏఎస్ కమిటీతో కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమావేశం నుంచి అర్ధతంతరంగా...

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రేపటి నుంచి యథాతధంగా జరగనుంది. ఐఏఎస్ కమిటీతో కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమావేశం నుంచి అర్ధతంతరంగా బయటకు వచ్చిన జేఏసీ నేతలు సమ్మెకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మేము ఎవరి చేతుల్లో కీలు బొమ్మలం కాదని, ఆర్టీసీని బతికించడానికి చేస్తున్న పోరాటమని నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడ్డారని, అయినా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్మాకు తాము భయపడేది లేదని, స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories