ఆర్టీసీ మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది.. సమ్మె కొనసాగిస్తాం : అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది.. సమ్మె కొనసాగిస్తాం : అశ్వత్థామ రెడ్డి
x
Highlights

టీఎస్ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె రెండో రోజు విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ట్రేడ్‌ యూనియన్‌ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ...అన్ని సంఘాలు తమకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు.

టీఎస్ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె రెండో రోజు విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ట్రేడ్‌ యూనియన్‌ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ...అన్ని సంఘాలు తమకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సమ్మెలోకి నెట్టింది. ఆర్టీసీని మూసివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు పరంచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు అధికారులు వాస్తవ పరిస్థితులు వివరించాలని అశ్వత్థామ రెడ్డి అన్నారు.

ఇందిరాగాంధీ పార్కు వద్ద నిరాహార దీక్షలు చేపడతామని, అందులో16 మంది జేఏసీ సభ్యులు పాల్గొంటారిని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వద్ద తమ సమస్యలు పరిష్కారం కాలేదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఇమేజ్ పొగొట్టాలని కేసీఆర్‌ కుట్ర పన్నారని. పండుగకు ముందు బలవంతంగా సమ్మెకు వెళ్లేలా చేశారన్నారు. కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఇది ఆరంభం మాత్రమేనని, తమ పోరాటం కొనసాగుతోందని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories