Tsrtc Strike : ముగిసిన డెడ్‌లైన్‌... కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం

Tsrtc Strike
x
Tsrtc Strike
Highlights

ఆర్టీసీ సమ్మె 33వ రోజు కొనసాగుతోంది. విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ రెండోసారి ఇచ్చిన డెడ్‌ లైన్‌ ను కార్మికులు భేఖాతరు చేశారు.

ఆర్టీసీ సమ్మె 33వ రోజు కొనసాగుతోంది. విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ రెండోసారి ఇచ్చిన డెడ్‌ లైన్‌ ను కార్మికులు భేఖాతరు చేశారు. ఆర్టీసీలో మొత్తం 49,733 మంది మొత్తం మంది కార్మికులుండగా సుమారు 400 మంది విధులకు హాజరయ్యారు. ముందు నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నట్లుగానే కార్మికులు విధుల్లో చేరలేదు. కేవలం రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు విధుల్లో చేరారని చెబుతున్నారు. నేడు అన్ని డిపోల వద్ద నిరాహార దీక్షలు చేపట్టనునున్నారు.

ఆర్టీసీ సమ్మెపై నేడు సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. కార్మికులకు ఇచ్చిన గడువు ముగియడంతో ప్రైవేటు బస్సుల పర్మిట్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం సాయంత్రం లోపు ప్రకటన చేసే అవకాశం ఉంది. రేపు హైకోర్టులో దీనిపై అన్ని విషయాలు సమర్పించాలని నిర్ణయించారు. డెడ్‌ లైన్ ముగిసిన తర్వాత ఆర్టీసీ ఉండదని సీఎం ప్రకటించడంతో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

ఆర్టీసీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే 5,100 సర్వీలను ప్రైవేటీకరించిన నేపథ్యంలో మరో 5వేల సర్వీసులను కూడా ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం వందశాతం ఆర్టీసీని ప్రైవేటీకిరంచి ఆర్టీసీ రహిత తెలంగాణగా మారుస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కార్మికులు విధుల్లో చేరకపోవడంతో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది.

ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టు మరోసారి విచారించనుంది. ఒకవైపు సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ జేఏసీ నేతలు చెబుతున్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు , ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నారు. రేపు సడక్ బంద్ ‌తో పాటు ఉద్యోగులు పెన్‌డౌన్ చేయాలని నిర్ణయించారు. ఎల్లుండి చలో ట్యాంక్ బండ్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories