ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం
x
Highlights

-ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి హౌస్‌ అరెస్ట్‌ -ఈయూ కార్యాలయంలో దీక్షకు ఆర్టీసీ జేఏసీ పిలుపు

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వివిధ డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇవాళ్టితో 43వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నేడు బస్ రోకోకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయంలో దీక్ష చేపట్టాలంటూ నేతలు పిలుపునిచ్చారు.

జేఏసీ పిలుపు నేపథ్యంలో యూనియన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే, అప్పటికే అశ్వత్థామరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



Keywords: TSRTC, JAC Convenor, Ashwathama Reddy, Arrest, Telangana Police, RTC Strike,

Show Full Article
Print Article
More On
Next Story
More Stories