TSRTC: టీఎస్‌ ఆర్టీసీ 'పల్లె వెలుగు టౌన్ బస్ పాస్'.. నెలకు రూ.800కే..

TSRTC Has Brought The Pallevelugu Town Bus Pass In Telangana
x

TSRTC: టీఎస్‌ ఆర్టీసీ 'పల్లె వెలుగు టౌన్ బస్ పాస్'.. నెలకు రూ.800కే..

Highlights

TSRTC: బస్‌ పాస్‌ పోస్టర్లను ఆవిష్కరించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

TSRTC: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రంలో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.

ఈ టౌన్‌ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్గొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు 800, 5 కిలోమీటర్ల పరిధికి 500 రూపాయలుగా... పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌ను సంస్థ తెచ్చింది.

హైదరాబాద్‌‌లోని బస్‌‌భవన్‌లో సోమవారం పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories