TSRTC: తెలంగాణలో అమల్లోకి పెరిగిన బస్ చార్జీలు.. రూ.5 పెంపు...

TSRTC Charges Increased in Telangana | Telugu News
x

TSRTC: తెలంగాణలో అమల్లోకి పెరిగిన బస్ చార్జీలు.. రూ.5లు పెంపు...

Highlights

TSRTC: డీజిల్ ధరలు పెరగడంతో ఇవాల్టినుంచే ఛార్జీలు పెరిగాయని వివరణ

TSRTC: తెలంగాణ ఆర్టీసీ మరోసారి ఛార్జీలను పెంచింది. పెరిగిన డీజిల్ ధరలకు తగ్గట్టుగా నిర్వహణభారాన్ని తగ్గించేందుకు ఛార్జీల పెంపు అనివార్యమైందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ సర్వీసులు, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో పెంచిన ఛార్జీలు ఇవాల్టినుంచే అమల్లోకి వచ్చాయి. 2021 డిసెంబరులో 85 రూపాయలున్న హైస్పీడ్ డీజిల్ ధర ప్రస్తుతం 118 రూపాయలకు పెరిగింది. పెరిగిన డీజిల్ ధరతో నిర్వహణభారం ఎక్కువైందని ఛార్జీలు పెంచక తప్పలేదని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories