Tsrtc : క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌లకు నడవనున్న ఆర్టీసీ బ‌స్సులు

Tsrtc : క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌లకు నడవనున్న ఆర్టీసీ బ‌స్సులు
x
Highlights

Tsrtc : తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా వ్యవస్థను లాక్ డౌన్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు...

Tsrtc : తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా వ్యవస్థను లాక్ డౌన్ కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాలకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే పొరుగు రాష్ర్టాలైన క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌కు కూడా ఆర్టీసీ బ‌స్సులు న‌డిపేందుకు తెలంగాణ స‌ర్కార్ గ్రీన్ స్నిగల్ ఇచ్చింది. దీంతో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్టకు టీఎస్ ఆర్టీసీ బ‌స్సులను సెప్టెంబ‌ర్ 28 నుంచి న‌డ‌ప‌నుంది. తెలంగాణ నుంచి ఆయా రాష్ట్రాలకు మాత్రమే కాకుండా ఆ రెండు రాష్ట్రాలనుంచి కూడా బస్సులును తెలంగాణకు నడవనున్నాయి. రాయ‌చూర్, బీద‌ర్, గుల్బ‌ర్గా, నాందేడ్, ముంబ‌యి, పుణె, నాగ్‌పూర్‌, చంద్రాపూర్ మార్గాల్లో తెలంగాణ ఆర్టీసీ బ‌స్సులు న‌డ‌ప‌నుంది. ఇక బెంగ‌ళూరుకు మాత్రం బ‌స్సుల‌ను న‌డ‌పొద్ద‌ని ఆర్టీసీకి ప్ర‌భుత్వం సూచించింది.

కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సులను కూడా మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడడంతో లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం, అలాగే జిల్లాల్లో కరోనా కుసుల సంఖ్య కొంత మేర తగ్గడంతో రాజధాని నుంచి ఇతర జిల్లాలకు బస్సు సర్వీసులను గతంలో ప్రారంభించింది. ఇదే క్రమంలో గ్రేటర్‌లో కూడా ఆర్టీసీ సర్వీసులను శుక్రవారం నుంచి ప్రభుత్వం నడిపిస్తుంది. గత ఇప్పటికే బుధవారం నుంచి నగర శివార్లలోని బస్సులను ఇతర ప్రాంతాలకు పాక్షికంగా తిప్పుతున్నప్పటికీ శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో బస్సులు నడుపుతుంది. అంతే కాదు బస్సులో ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. సాధారణంగా అయితే సిటీ బస్సుల్లో రద్దీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌లో 3798 ఆర్టీసీ బస్సులుండగా గతేడాది సమ్మె కారణంగా ప్రభుత్వం కొన్ని బస్సు సర్వీసులను పక్కనబెట్టింది. ఈ పరిమిత సంఖ్యలోనే ప్రస్తుతం బస్సులను నడిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories