Revanth Reddy: నిరుద్యోగుల జీవితాలతో TSPSC ఆటలాడుతోంది

TSPSC Is Playing With The Lives Of Unemployed People Said Revanth Reddy
x

Revanth Reddy: నిరుద్యోగుల జీవితాలతో TSPSC ఆటలాడుతోంది

Highlights

Revanth Reddy: పార్టీ ఫిరాయింపులు, ఓట్ల కొనుగోళ్లపైనే సమీక్షలు చేస్తున్నారు

Revanth Reddy: TSPSC బోర్డు రద్దు కోసం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. నిరుద్యోగుల కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. కేవలం పార్టీ ఫిరాయింపులు, ఓట్ల కొనుగోళ్లపైనే ప్రగతిభవన్‌లో సమీక్షలు జరుగుతున్నాయని ఆరోపించారు. 30 లక్షల మంది జీవితాలతో ఆటలాడుతున్న TSPSC బోర్డుపై మాత్రం సమీక్ష చేయకపోవడం దారు‎ణమన్నారు రేవంత్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories