తెలంగాణ గ్రూప్-2 ఫలితాల విడుదల

TSPSC group 2 results declared
x

తెలంగాణ గ్రూప్-2 ఫలితాల విడుదల

Highlights

తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది.

తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.

గ్రూప్ 2 పరీక్ష రాసిన 2.36 లక్షల మంది అభ్యర్థులు.గ్రూప్ 2 టాపర్ కు 447 మార్కులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో ఓఎంఆర్ షీట్లను కూడా పొందుపర్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ tspsc. gov.in వెబ్ సైట్ లో అభ్యర్ధులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. గ్రూప్ 2 టాప్ ర్యాంకర్ ఎన్. వెంకట హర్షవర్ధన్ 447 మార్కులతో గ్రూప్ 2 లో ఫస్ట్ ర్యాంకు పొందారు. 444 మార్కులతో వడ్లకొండ సచిన్ రెండో ర్యాంకు పొందారు. 439 మార్కులతో మనోహర్ రావుకు మూడో ర్యాంకు సాధించారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ tspsc. gov.in వెబ్ సైట్ లో అభ్యర్ధులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల కోసం వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన సమయంలో ఏదైనా టెక్నికల్ సమస్య ఎదురైతే హెల్ప్ డెస్క్ ను కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 040 23542185 లేదా 040 23542187 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

ఈ ఫోన్లతో పాటు [email protected] మెయిల్ కు సమాచారం పంపాలని కూడా కోరారు.మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, సబ్ రిజిష్ట్రార్లు అసిస్టెంట్ రిజిష్ట్రార్, లేబర్ ఆఫీరసర్లు, అసిసస్టెంట్ లేబర్ ఆఫీసర్ వంటి పోస్టులను ఈ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories