TS Weather Report Today: తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ...

TS Weather Report Today High Temperatures Recorded Orange Alert Issued | Live News
x

TS Weather Report Today: తెలంగాణలో మండుతున్న ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ...

Highlights

TS Weather Report Today: సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు మేర అధిక ఉష్ణగ్రతలు...

TS Weather Report Today: భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను క్రాస్ అవుతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఎండల వేడి, ఉక్కపోతకు సతమతమవుతున్నారు. తాజాగా వాతావరణ కేంద్రం తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది.

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగతాయని హెచ్చిరించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 మధ్య నమోదవువుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories