Breaking News: పోలీసుల అదుపులో వనమా రాఘవ.. దమ్మపేట దగ్గర అదుపులోకి...

TS Police Arrested Vanama Ragavendra at Bhadradri Kothagudem Dammapeta | Palwancha Incident
x

Breaking News: పోలీసుల అదుపులో వనమా రాఘవ.. దమ్మపేట దగ్గర అదుపులోకి...

Highlights

Breaking News: *ఎస్పీ ఆఫీస్‌లో రాఘవను విచారిస్తున్న పోలీసులు *పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచే ఛాన్స్

Breaking News: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులోని దమ్మపేట దగ్గర రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోగా.. ఈ కేసులో ఏ2గా ఉన్నాడు రాఘవ. ఈ ఘటన తర్వాత రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లాడు. రామకృష్ణ సూసైడ్‌ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా వనమా రాఘవపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

రాఘవతో పాటు ఆయనకు సహకరించిన మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవ ప్రయాణించిన కారును సీజ్‌ చేశారు. ఎస్పీ ఆఫీస్‌లో రాఘవను విచారిస్తున్నారు పోలీసులు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని జిల్లా ఎస్పీ సునీల్ దత్‌ తెలిపారు.

పాల్వంచ‌లో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. వనమా రాఘవ వేధింపుల వల్లే తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు స్వయంగా రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పెను దుమారం చెలరేగింది. ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెలువెత్తడంతో.. టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories