బీజేపీపై రాజకీయ అస్త్రం ఎక్కుపెట్టిన టీఆర్ఎస్.. రాష్ట్రస్థాయిలో భారీ ఉద్యమం

TS Ministers in Delhi Tour and Political War Started Between TRS and BJP | Telangana News
x

బీజేపీపై రాజకీయ అస్త్రం ఎక్కుపెట్టిన టీఆర్ఎస్.. రాష్ట్రస్థాయిలో భారీ ఉద్యమం

Highlights

TRS vs BJP: కేంద్రమంత్రులను, ప్రధానిని కలవాలని నిర్ణయం...

TRS vs BJP: టీఆర్ఎస్ - బీజేపీ మధ్య రోజు రోజుకు పొలిటికల్ వార్ ముదురుతోంది. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుని గేమ్ రసవత్తరంగా సాగిస్తున్నారు. వరి ధాన్యం విషయంలో బీజేపీపై రాజకీయ అస్త్రం ఎక్కుపెట్టిన టీఆర్ఎస్... గేమ్ ఢిల్లీకి మార్చింది. మరోమారు కేంద్రమంత్రులను, ప్రధానిని కలిసి తెలంగాణకు న్యాయం చేయాలని కోరుతోంది. కేంద్రం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో భారీ ఉద్యమం చేయాలని డిసైడ్ అయ్యింది కారు పార్టీ.

తెలంగాణ మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. వీరు మళ్లీ మళ్లీ ఎందుకు ఢిల్లీ వెళ్లారంటే.. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత తీసుకోవడం కోసమని అంటున్నారు. కేంద్రం తాను చెప్పాల్సిన విషయాన్ని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పింది. తెలంగాణ ప్రభుత్వమే ఎలాంటి బియ్యం ఇవ్వబోమని లేఖ ఇచ్చిందని ఓ లేఖను పీయూష్ గోయాల్ పార్లమెంట్‌లోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ లేఖపై వివాదం నడుస్తోంది. మెడ మీద కత్తి పెట్టి లేఖ తీసుకున్నాని కేసీఆర్ నేరుగా చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ మెడ మీద కత్తి పెట్టారో లేదో కానీ.. మొత్తానికి లేఖ అయితే ఇచ్చింది నిజమే కదా అని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. మెడ మీద కత్తి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎందుకు లేఖ ఇవ్వాల్సి వచ్చిందో మాత్రం ఇంత వరకూ టీఆర్ఎస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మరో విడత మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపించారు.

మొదట ఓ సారి మంత్రుల బృందం వెళ్లింది... తర్వాత స్వయంగా కేసీఆర్ వెళ్లారు.. కానీ ఎవర్నీ కలవలేదు... కానీ కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేవడానికి ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో నిరసన తెలియజేశారు. కేంద్ర మంత్రుల ప్రకటనలు విని పార్లమెంటు సమావేశాలు బాయ్‌కట్ చేశారు.అయితే రాజకీయంగా బీజేపీపై... పైచేయి సాధించడానికి సీఎం కేసీఆర్ వేసిన ఎత్తుగడగా చాలా మంది భావిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో గ్రామ మండల స్థాయి జిల్లా కేంద్రంలో కేసీఆర్ ధర్నాలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories