TS Ministers - Piyush Goyal: పీయూష్‌ గోయల్‌ని కలిసిన మంత్రులు, ఎంపీలు

TS Minister Met Central Minister Piyush Goyal about Paddy Crop | Telangana News Today
x

TS Ministers - Piyush Goyal: పీయూష్‌ గోయల్‌ని కలిసిన మంత్రులు, ఎంపీలు

Highlights

TS Ministers - Piyush Goyal: యాసంగి వరి ధాన్యం కొనబోమన్న పీయూష్‌ గోయల్‌...

TS Ministers - Piyush Goyal: ధాన్యం కొనుగోలు విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్‌ ఎంపీలు ఎట్టకేలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు ధాన్యం సేకరణపై చర్చించారు. కొనుగోలుపై లిఖితపూర్వక హామీకి మంత్రులు, ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పినట్లు సమాచారం.

యాసంగి వరి పంటను కేంద్రం కొనదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తేల్చిచెప్పినట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. కాగా.. వానాకాలంలో 60 లక్షల టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యం నిర్దేశించగా.., ఆలక్ష్యం 3 రోజుల్లో పూర్తి కానుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కొనాల్సిన ధాన్యం ఇంకా 10 నుంచి 12 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉందన్నారు రాష్ట్ర మంత్రి. మరో 5లక్షల ఎకరాల్లో వరి కోతలు జరుగుతున్నాయని.. ఆధాన్యం జనవరి 15వ తేదీ వరకు అందుబాటులోకి వస్తుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

ఇక జనవరి 15వ తేదీకి అందుబాటులోకి వచ్చే ధాన్యాన్ని సేకరించాలా? వద్దా? అని పీయూష్‌ గోయల్‌ని స్పష్టత కోరినట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు ఉంచాలా? మూసివేయాలా? అని కూడా కేంద్రమంత్రిని అడిగినట్లు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పష్టత ఇచ్చేందుకు రెండురోజుల సమయం పీయూష్‌ గోయల్‌ కోరినట్లు తెలియజేశారు. ఇక ధాన్యం సేకరణపై తేల్చుకున్న తర్వాతనే తెలంగాణకు తిరిగి పయనమవుతామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories