నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశం

TS High Court Hearing Complete on Ganesh Immersion in Hussain Sagar
x

గణేష్ నిమజ్జనం పై హై కోర్ట్ లో విచారణ (ఫైల్ ఇమేజ్)

Highlights

TS High Court: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది.

TS High Court: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం నిషేధించాలని పిటిషన్‌ దాఖలయ్యింది. పిల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, గణేష్‌ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని సూచించింది. నిమజ్జనం సమయంలో కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులపై కూడా ఫోకస్ పెట్టాలని తెలిపింది హైకోర్టు. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న హైకోర్టు సామూహిక నిమజ్జనంతో స్సేన్‌సాగర్‌ దెబ్బతినకుండా చూడాలని సూచించింది. అందరి సూచనలు పరిగణలోకి తీసుకొని ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది హైకోర్టు.


Show Full Article
Print Article
Next Story
More Stories