బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TS High Court Given Green Signal To BJP Maha Dharna At Indira Park
x

బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 

Highlights

BJP: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధర్నా

BJP: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై మహాధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో మహాధర్నాకు పోలీసుల అనుమతిపై హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది.

అయితే ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించారు. కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని అడిగింది.

ఐదువేల మందికి మీరు భద్రత కల్పించలేక పోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అని సర్కార్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. చివరకు బీజేపీ మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కేవలం ధర్నా చేసుకోవాలని, ఎలాంటి ర్యాలీ చేయవద్దని ఆదేశించింది. అలాగే 500 మందితో ధర్నా చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories