TSLPRB Notification 2022: తెలంగాణలో ఆబ్కారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్...

TS Govt Released Notification for Prohibition and Excise Constable Recruitment 2022 | Live News Today
x

TSLPRB Notification 2022: తెలంగాణలో ఆబ్కారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్...

Highlights

TSLPRB Notification 2022: మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ స్వీకరణ...

TSLPRB Notification 2022: రాష్ట్రంలో ఇప్పటికే 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. గురువారం ట్రాన్స్‌పోర్ట్, అబ్కారీ శాఖల్లోని కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలోని 63 కానిస్టేబుల్‌ పోస్టులు, ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లో 614 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొంది.

రవాణా శాఖలో హెడ్‌ ఆఫీస్‌లో 6 కానిస్టేబుల్‌ పోస్టులు, లోకల్‌ కేడర్‌ కేటగిరీలో 57 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అబ్కారీ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, రవాణా శాఖ పోస్టులకైతే ఇంటర్‌తో పాటు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు వెల్లడించారు.

ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని సూచించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని పోస్టులు, కేటగిరీలకు ఏయే రిజర్వేషన్లు ఉన్నాయో అవే రిజర్వేషన్లు ఆయా కేటగిరీల అభ్యర్థులకు వర్తిస్తాయని బోర్డు స్పష్టం చేసింది. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే విధంగానే ముందుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు, చివరగా తుది రాత పరీక్ష ఉంటుందని తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories