భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ గవర్నర్ పర్యటన...

TS Governor Tamilisai Soundararajan Bhadradri Kothgudem Tour | Live News
x

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ గవర్నర్ పర్యటన...

Highlights

Tamilisai Soundararajan: గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదని విచారం...

Tamilisai Soundararajan: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో తెలంగాణ గవర్నర్ తమిళసైకి ప్రజలు వినతులు సమర్పించారు. సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్ లో బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలోని వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. అశ్వాపురం భూ నిర్వాసితులు, షెడ్యుల్డు తెగలకు హౌస్ అలవెన్సు ఇవ్వాలని, వికలాంగులు తమకు న్యాయం చేయాలని వినతి పత్రాలు సమర్పించారు.

తెలంగాణలో గవర్నర్ వ్యవస్థకు విలువ లేకుండా పోయిందని కోనేరు సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం రోజు రాష్ట్ర మంత్రులు జిల్లా అధికారులు ఉన్నారు. కానీ.. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ అధికారులెవరూ అందుబాటులో లేకుండా పోయారని ఆయన విచారం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories