logo

టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పొడగింపు

టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పొడగింపు

టీఎస్ ఎడ్‌సెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 20 వరకు గడువు పొడిగించారు అధికారులు. ఈ మేరకు టీఎస్‌ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టి.మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు. 2019-2020 సంవత్సరానికి సంబంధించిన రెండేండ్ల బీఈడీ కోర్సుకు ఆలస్య రుసుం లేకుండా ఈనెల 20 వరకు, రూ.500 ఫైన్‌తో ఈనెల 25 వరకు, రూ.వెయ్యి ఆలస్య రుసుంతో ఈనెల 30, రూ.2వేలు లేట్ ఫీజుతో మే 4వ తేదీ వరకు అవకాశం ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇక మే 31న ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎంట్రన్స్ టెస్ట్‌ను, మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్టు మృణాళిని తెలిపారు.

లైవ్ టీవి

Share it
Top