TS E-Challan: పెండింగ్‌ చలాన్ల చెల్లింపుకు.. మిగిలింది అయిదు రోజులే

Ts E Challan News Telangana Pending Traffic E Challan Offer Deadline Is Just Five More Days
x

TS E-Challan: పెండింగ్‌ చలాన్ల చెల్లింపుకు.. మిగిలింది అయిదు రోజులే

Highlights

TS E-Challan: రాచకొండ పరిధిలో రూ.7.17 కోట్ల మేర చెల్లింపులు

TS E-Challan: ట్రాఫిక్ పెండింగ్‌ చలానాలపై పోలీసులు ప్రకటించిన రాయితీలకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. గత నెల 26 నుంచి జనవరి 5 తేదీ వరకూ 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. రాయితీలతో చెల్లించే అవకాశం 10తేదీ వరకు మాత్రమే ఉందని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ ఎం.విశ్వప్రసాద్‌ తెలిపారు.

పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించటంతో మంచి స్పందన లభిస్తోంది. మరో ఐదు రోజులే గడువు ఉండటంతో.. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీనిబట్టి మరిన్ని చలాన్లు చెల్లింపులు జరిగే అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు సైబర్‌ నేరస్థులు నకిలీ ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌తో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని.., చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690 నంబర్లలో సంప్రదించాలన్నారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories