TS Congress: హస్తం..వ్యూహం.. పార్లమెంట్ ఎన్నికలకు టీకాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీ

Ts Congress Is A New Strategy For Parliament Elections
x

TS Congress: హస్తం..వ్యూహం.. పార్లమెంట్ ఎన్నికలకు టీకాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీ

Highlights

TS Congress: పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగొలుతో ఇటీవల రేవంత్ రెడ్డితో భేటీ

TS Congress: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్‌.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఓ వైపు సిక్స్ గ్యారంటీస్‌ అమలుకు కసరత్తు చేస్తూనే మరోవైపు పార్టీ పరంగా కేడర్‌ను సమాయత్తం చేస్తోంది హస్తం పార్టీ. జిల్లాల్లో భారీ బహిరంగ సభలు, కుల, మత సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే ప్రచార సభలు, సమావేశాలు ఏర్పాటు చేసిందో అదే ఫార్ములాను పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేయాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో రేవంత్‌ రెడ్డి.. జిల్లా పర్యటనలు చేయనున్నారు. అందులో భాగంగా పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగొలుతో ఇటీవల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ పని తీరు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశంపై రేవంత్ రెడ్డి కి సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చేసినట్టే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అభ్యర్థిపై సర్వేలు, నియోజక వర్గాల వారీగా ముఖ్య నాయకుల అభిప్రాయం వీటన్నింటిని తీసుకుని టికెట్ లు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్యమైన నాయకులతో రేవంత్ సమావేశం అయ్యారు. తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులతో ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కూడా భేటీలు నిర్వహిస్తున్నారు.

తాజాగా 36వేల మంది బూత్ లెవల్ ఏజెంట్ లతో ఎల్బి స్టేడియం లో ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా బూత్ లెవల్ ఏజెంట్ ల నుండి మొదలుకుని రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకున్న తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారట కాంగ్రెస్ నేతలు.

రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి..కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే brs అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులపై కూడా ప్రచారం చేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడానికి వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్.

Show Full Article
Print Article
Next Story
More Stories