Khammam: ఖమ్మం కూసుమంచి వద్ద ట్రక్కులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

Truck Driver Burned To Death As Truck Catches Fire In Khammam
x

Khammam: ఖమ్మం కూసుమంచి వద్ద ట్రక్కులో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

Highlights

Khammam: కూసుమంచి మండలం గురవాయిగూడెంలో ఘటన

Khammam: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గురువాయిగూడెం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ లోడ్‌తో వెళుతున్న డీసీఎం వాహనం ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. డ్రైవర్ కు తోడుగా ఉన్న వాహనం యజమానికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే గమనించిన వాహనదారులు అతన్ని బయటికి తీసి ఖమ్మం హాస్పిటల్ కి తరలించారు. డీసీఎం వాహనం అనకాపల్లి జిల్లా నుండి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories