మంచిర్యాలలో బీజేపీ - టీఆర్ఎస్ వర్గపోరు

TRS Vs BJP In Mancherial | TS News
x

మంచిర్యాలలో బీజేపీ - టీఆర్ఎస్ వర్గపోరు

Highlights

*వరద బాధితులకు న్యాయం చేయాలంటూ ఐబీ వద్ద బీజేపీ మౌన దీక్ష *పోటీగా అదే చౌరస్తాలో జీఎస్టీ పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ ధర్నా

Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పట్టణంలోని ఐబీ చౌరస్థలో బీజేపీ ఆర్ఎస్ నేతలు పోటాపోటీ దీక్షలు, ధర్నాలకు దిగారు. వరద బాధితులకోసం బీజేపీ నేతలు మౌన దీక్ష చేపట్టారు. ఈవిషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు అదే ఐబీ చౌరస్థలో బీజేపీ పాల ఉత్పత్తిలపై GSTని వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలో చౌరస్థాలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండా కిందపడటంతో అది టీఆర్ఎస్ నేతల పనే అంటూ బీజేపీ నేతలు గొడవకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ పరస్పరం దాడులు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ TRS శ్రేణులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. దీంతో గొడవ సద్దుమనిగింది.


Show Full Article
Print Article
Next Story
More Stories