నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక.. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసే ప్లాన్ రెడీ చేసిన టీఆర్ఎస్

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక..  బీజేపీ దూకుడుకు కళ్లెం వేసే ప్లాన్ రెడీ చేసిన టీఆర్ఎస్
x
Highlights

*రంగంలోకి దిగనున్న పార్టీ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ *ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం

దుబ్బాకలో దెబ్బపడింది. గ్రేటర్‌లో ఓడిపోయినంత పనైంది. ఇప్పుడు మళ్లీ నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక రాబోతోంది. ఈ ఎన్నికను టీఆర్ఎస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. నాగార్జునసాగర్‌పై గులాబీ జెండా ఎగురవేసి, బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలని ప్లాన్‌ చేస్తోంది. నోటిఫికేషన్ వచ్చేలోపే ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టేశారు. బై ఎలక్షన్‌ ప్రచారానికి సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారని సమాచారం. మరీ నాగార్జునసాగర్‌ ఉపఎన్నికపై టీఆర్ఎస్‌ వ్యూహమేంటి.? బీజేపీకి ఎలా చెక్‌ పెట్టనుంది.? నాగార్జునసాగర్‌ ప్రజలను టీఆర్ఎస్‌ ఎలా మెప్పించనుంది.?

దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్‌కు గుబులు పట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రచారానికి దూరంగా ఉండడం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అలాంటి మిస్టేక్‌ ఈ సారి జరుగకుండా జాగ్రత్త పడుతున్నారు గులాబీ బాస్. పైగా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక వ్యూహాన్ని మంత్రి కేటీఆర్ దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే సీఎం కేసీఆర్ నార్జునసాగర్‌లో బహిరంగసభకు ప్లాన్ చేశారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో సీఎం బహిరంగసభ ఉంటుందని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్‌ శ్రేణులకు సమాచారమిచ్చారు

ఈ బహిరంగసభతో ప్రజల్లో.. పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకురావాలని గులాబీ బాస్‌ కేసీఆర్ ప్లాన్‌ చేసినట్లు కనిపిస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ ఫిబ్రవరిలో లేదా మార్చిలో వచ్చే అవకాశముంది. అప్పడు చూసుకుందాంలే అని కాకుండా ముందుగానే జనాల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది.

ఇప్పటికే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రయోజనాలు కలిగేలా ప్రాజెక్టులు.. పథకాలను మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వీటిపై ప్రజల్లో సానుకూల చర్చ జరిగేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. మరిన్ని పనులు చేస్తామని టీఆర్ఎస్‌ నేతలు భరోసా కల్పించే అవకాశాలున్నాయి. ఇటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతుండడంతో జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఫుల్‌ జోష్‌తో పనిచేసే ఛాన్స్‌ కనిపిస్తోంది.

అభ్యర్థిని ప్రకటించక ముందే ప్రచారంలోనే దూసుకువెళ్లాలని టీఆర్ఎస్‌ భావిస్తోంది. చివరలో పార్టీ అధినేత కేసీఆర్ సూచించిన వ్యక్తిని గెలిపించే బాధ్యతను జిల్లా నేతలు భూజాన వేసుకోనున్నారు. అప్పటి వరకు ప్రచారంలో ఏమాత్రం లోటు లేకుండా బరిలోకి దిగనున్నారు గులాబీ బాస్‌ కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories