వీడిన ఉత్కంఠ : నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం

వీడిన ఉత్కంఠ : నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం
x
Highlights

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది....

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. చైర్మన్‌ ఎన్నికను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌, ఆ పార్టీ సభ్యులు బాయ్‌కాట్‌ చేశారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఓటుతో టీఆర్‌ఎస్‌ బలం 11కు చేరుకుంది. ఉత్తమ్‌, కేవీపీతో కాంగ్రెస్‌ ఓట్లు 10కు చేరుకున్నాయి.

సమావేశం జరుగుతున్న సమయంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుటే ఇరుపార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికను కాంగ్రెస్‌ బహిష్కరించింది. ఇరుపార్టీలు ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అంతకుముందు ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డిని ఎక్స్‌అఫిషియో జాబితాలో చేర్చడంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికలే నిర్వహించకపోతే పోటీ ఉండేది కాదు కదా అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నేరేడుచర్లలో కాంగ్రెస్‌ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోలో పాల్గొన్న ఉత్తమ్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి.. మిర్యాలగూడాకు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories