మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్

Munugode By-poll: మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

Jyothi
Updated on: 7 Oct 2022 1:15 PM IST
TRS Party Announce Kusukuntla Prabhakar Reddy as TRS Candidate for Munugode By Poll
X

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్

Munugode By-poll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అధికారికంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. మునుగోడు ఉపఎన్నికలు తెరపైకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా పలు పేర్లు పరిశీలనకు వచ్చినా.. చివరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు గులాబీ బాస్.

ఉద్యమకారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కొనసాగుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మునుగోడు ఉపఎన్నిక అంశం తెరపైకి వచ్చిన వెంటనే బీజేపీ తర్వాత కాంగ్రెస్‌ వరుసగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు.. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వీరికి ధీటుగా టీఆర్ఎస్‌ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ... అభ్యర్థి ప్రకటనపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతూనే వచ్చింది. ఎట్టకేలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి మునుగోడులో తమ అభ్యర్థిని ప్రకటించింది టీఆర్‌ఎస్‌.

Jyothi

Jyothi

Next Story