టీఆర్‌ఎస్‌ ఇక బీఆర్‌ఎస్‌.. ఆమోదం తెలిపిన ఎన్నికల సంఘం..రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం..

Bharat Rashtra Samithi: బీఆర్‌ఎస్‌కు సీఈసీ లైన్ క్లియర్ చేసింది.

Arun Chilukuri
Published on: 8 Dec 2022 6:26 PM IST
TRS Now Bharat Rashtra Samithi Says Election Commission of India
X

టీఆర్‌ఎస్‌ ఇక బీఆర్‌ఎస్‌.. ఆమోదం తెలిపిన ఎన్నికల సంఘం.. రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం..

Bharat Rashtra Samithi: బీఆర్‌ఎస్‌కు సీఈసీ లైన్ క్లియర్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు అధికారికంగా సీఈసీ లేఖ రాసింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు BRS ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. BRS అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

రేపు మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు సీఈసీ లేఖకు కేసీఆర్ రిప్లై ఇవ్వనున్నారు. సీఈసీ రిప్లై లేఖపై రేపు మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ తర్వాత BRS జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఇక తెలంగాణ భవన్‌కు జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీలు హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు. జడ్పీ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు కూడా హాజరుకావాలని ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story