నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్‌ సరికొత్త వ్యూహం

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్‌ సరికొత్త  వ్యూహం
x
Highlights

టీఆర్ఎస్‌ సరికొత్త ఎన్నికల వ్యూహంతో ముందుకుసాగుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు కొత్త ప్రణాళికను అమలు చేయాలని చూస్తోంది. పార్టీ క్యాడర్‌ను కూడా...

టీఆర్ఎస్‌ సరికొత్త ఎన్నికల వ్యూహంతో ముందుకుసాగుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు కొత్త ప్రణాళికను అమలు చేయాలని చూస్తోంది. పార్టీ క్యాడర్‌ను కూడా ఆదిశగా సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే అక్కడి సామాజిక సమతుల్యత ఆధారంగా అభ్యర్ధిని నిలిపి గెలిపించుకోవాలని చూస్తూనే పరిస్థితి అనుకూలంగా లేకపోతే బీజేపీకంటే ఎట్టి పరిస్థితిలోనూ వెనుకబడొద్దని చూస్తోంది.

తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీని నిలువరించడమే ఇప్పుడు టీఆర్ఎస్‌ ముందున్న ప్రధాన లక్ష్యం. దుబ్బాక, జీహెచ్ఎంసీలో సత్తా చాటిన బీజేపీకి చెక్ చెప్పడంఎలాగనే దానిపై గులాబీ బాస్‌ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాలని బీజేపీయోచిస్తోంది. అందుకోసం గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటోంది. అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేసుకుంటోంది. అయితే ఎలాగైనా అక్కడ బీజేపీ దూకుడుకుకళ్లెం వేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నాగార్జునసాగర్‌లో బీజేపీకి చెక్‌ పెట్టేందుకు కేసీఆర్‌ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని టీఆర్ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీటీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. అక్కడ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. దీంతో టీఆర్ఎస్ నుంచిఎవరు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు అవకాశం ఉంటుందా లేక కొత్త అభ్యర్థిని రేసులో దింపాలా అనే యోచనలో ఉన్నారట గులాబీబాస్.

అయితే రాజకీయంగా తనదైన వ్యూహం అమలు చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్‌ పక్షం సాగర్‌లో బీజేపీ ప్రస్తావన ఎక్కువగా తీసుకురావొద్దని చూస్తోంది. పార్టీ అధినేతకేసీఆర్‌ కూడా ఆ పార్టీ నేతలకు అదే సూచించారట. అంతేకాదు అసలు నాగార్జునసాగర్‌ఎన్నికలు పూర్తయ్యేంత వరకు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీపై పెద్దగా విమర్శలు చేయొద్దని కేసీఆర్‌ తమ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.

కేసీఆర్ ఆదేశాలతో సాగర్‌లో పార్టీ ఇప్పటికే తమ పని కానిస్తూ ముందుకు సాగుతోంది. పార్టీ నేతలంతా అభ్యర్ధి ఎవరనే దానికంటే అంతర్గతంగా ప్రచారంపై దృష్టి సారించారు.అభివృద్ధి పనులు శంఖుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు. సాగర్‌లో కాంగ్రెస్ నేత జానారెడ్డిని ఢీ కొట్టలేని పక్షంలో అక్కడ ఎట్టి పరిస్థితిలోను టీఆర్ఎస్ రెండో స్థానంలోఉండేలా చూసుకుంటున్నారట. ఇందుకు యాదవ సామాజిక వర్గాన్ని అక్కున చేకూర్చుకోవడానికి దివంగత నేత నోములు నర్శింహయ్య కుమారుడు భరత్‌ను బరిలో దింపితేసానుభూతి ఓట్లతో పాటు పార్టీ బలంతో వచ్చే ఓట్లు కూడా ఉపయోగ పడతాయనే అంచనాలో ఉన్నారు.

మొత్తానికి బీజేపీకి రాజకీయంగా చెక్ చెప్పాలంటే ఆ పార్టీ విషయంలో చూస్తూ ఊరుకోకుండా ఆయా పరిస్థితులకు అనువైన వ్యూహంతో ముందుకు సాగాలని టీఆర్ఎస్శ్రేణులు చూస్తున్నాయి. అధినేత నుంచి వచ్చే ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాలని చూస్తున్నారు. సాగర్‌లో నష్టం జరిగితే రానున్న రోజుల్లో పార్టీకి రాజకీయంగాపెను నష్టం తప్పదనే యోచనలో ముందుకు సాగుతున్నారు. అందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories