TRS MLC: టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు

TRS Local Bodies MLC Candidates list Almost Finalized
x

దాదాపు ఖారైనా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు (ఫైల్ ఇమేజ్)

Highlights

TRS MLC: పలువురు అభ్యర్థులకు బీఫామ్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌

TRS MLC: టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ బీఫామ్‌ కూడా ఇచ్చినట్టు సమాచారం. రేపు, ఎల్లుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆదిలాబాద్‌ - దండే విఠల్, ఖమ్మం - తాత మధు, మహబూబ్‌నగర్‌ - సాయిచంద్‌, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి - శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్ - పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ - ఎంసీ కోటిరెడ్డి, మెదక్ - డాక్టర్ యాదవరెడ్డి, కరీంనగర్ - ఎల్.రమణ, భాను ప్రసాద్‌రావు పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే.. నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories