ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ.

ప్రైవేట్ అధ్యాపకులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ.
x
Highlights

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించి, ప్రయివేట్ ఉపాధ్యాయులను వెంటనే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష కు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ .రమణ హాజరై మద్దతు తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడతూ, ప్రయివేట్ ఉపాధ్యాయులు ,లెక్చరర్స్ గత 9 నెలలుగా కరోనా మహమ్మారి నుండి ప్రయివేట్ పాఠశాలలు,కళాశాలలు మూత పడడం తో ప్రయివేట్ అధ్యాపకులు ,లెక్చరర్ లు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో పీజీ లు చేసిన వారు కూలీలుగా మారారు.2019 లో కేసీఆర్ ప్రకటించిన మ్యాని ఫెస్టో లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ భృతి కల్పించి ప్రవేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్య లతో ప్రభుత్వం చర్చించి వారికి ఉద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే ఇటీవలే అచ్చంపేట పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతని కుటుంబానికి 10 వేల రూపాయాల ఆర్దిక సహాయం అందచేశారు. ఆత్మహత్య చేసుకున్న అధ్యాపకుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని , ప్రైవేట్ అధ్యాపకులకు 9నెలలకు నెలకు పది వేల చొప్పున ఆర్దిక సహయం అందజేయలన్నారు.లేనిపక్షంలో ప్రగతి భవనం ముట్టడి చేస్తామని ప్రభుత్వాని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories