Warangal: పూర్తైన మేయర్ల ఎన్నిక..వరంగల్‌ మేయ‌ర్‌,డిప్యూటీ వీరే

warangal mayor
x

వరంగల్ మేయర్ ఎన్నిక 

Highlights

Warangal: తెలంగాణలో జరిగిన 2 కార్పొరేషన్‌, 5మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగరవేసింది.

Warangal: తెలంగాణలో జరిగిన 2 కార్పొరేషన్‌, 5మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగరవేసింది. కార్పొరేషన్‌లకు మేయర్‌, ఉప మేయర్‌, మున్సిపాలిటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల విషయమై టీఆర్‌ఎస్‌ సమాలోచనలు చేసి ఎట్టకేలకు వారిని ప్రకటించింది. వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ ప‌ద‌వికి రిజ్వాన షమీకి ద‌క్కింది. పార్టీ విధేయుల‌కే ప‌ట్టం క‌ట్టిన అధిష్టానం ప‌ట్టం క‌ట్టింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా టీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించారు. ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పేర్ల‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. మేయ‌ర్‌గా పునుకొల్లు నీర‌జ‌, డిప్యూటీ మేయ‌ర్‌గా ఫాతిమా జోహ్రో పేర్ల‌ను ఖ‌రారు చేశారు.

సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌: కడవేర్గు మంజుల, వైస్‌ చైర్మన్‌: జంగిటి కనకరాజు, అచ్చంపేట మున్సిపల్‌ చైర్మన్‌: ఎడ్ల నరసింహ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ పోరెడ్డి శైలజారెడ్డి, కొత్తూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ దోలి రవీందర్‌ జడ్చర్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దోరెపల్లి లక్ష్మీ, నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌, శ్రీనివాస్‌గౌడ్‌ పేర్లను ఎంపిక చేసారు.


Show Full Article
Print Article
Next Story
More Stories