నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు

TRS Dharnas in All District Centers Today | TS News
x

నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు

Highlights

TRS Dharna: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ ఆందోళన

TRS Dharna: కొన్నిరోజులుగా కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. అయితే తాము బాయిల్డ్ రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెబుతోంది. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ గులాబీ నేతలు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. అటు కేంద్రం దిగొచ్చే వరకు తమ పోరాటం ఆపబోమంటున్నారు. మొత్తానికి యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు చేయనుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories