Telangana: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూకుడు

TRS Aggression in Nagarjuna Sagar by Election
x

తెలంగాణ(ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

Telangana: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు.

Telangana: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి పెద్ద సార్ వస్తారా..? లేకపోతే హైదరాబాద్‌ నుంచి పర్యవేక్షిస్తారా అనేది టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీల కంటే ముందే దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్‌కు.. గులాబీ బాస్ కేసీఆర్‌తో మరో బహిరంగ సభ నిర్వహించాలా లేక క్యాంపెయినర్లతో సరిపెట్టుకోవాలని అనే వ్యూహ రచనలో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి..

సర్వశక్తులూ వడ్డుతోన్న టిఆర్ ఎస్..

నాగార్జునసాగర్ బై ఎలక్షన్ను టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మిగతా పార్టీల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించి గ్రామ గ్రామాల పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలను మండలాల వారీగా ప్రచార ఇంచార్జ్‌లుగా నియమించారు గులాబీ బాస్ కెసిఆర్.

పక్కా ప్లాన్‌తో ముందుకు..

ఎన్నిక ఏదైనా ఆషామాషీగా తీసుకోకుండా పకడ్బందీగా ప్లాన్‌తో ముందుకు పోవడంలో కార్ పార్టీ ముందుంటుంది. ఉద్యమ కాలం నుంచి అవసరమైన సందర్భంలో పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో పోల్ మేనేజ్మెంట్ తో టీఆర్ఎస్ ఆరితేరి పోయింది. అనేక ఎన్నికలలో ఎదుర్కొని జయాపజయాలు సొంతం చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానాలు కూడా దక్కించుకున్నారు. అయితే అనూహ్యంగా పార్టీ అభ్యర్థి రామలింగారెడ్డి మరణంతో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమి తో టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకున్నది. దీంతో ఇప్పుడు జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచార సరళి పర్యవేక్షిస్తూ నేతలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు.

చివరి నిమిషంలో అభ్యర్థి ప్రకటన...

నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో... చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా అన్ని పార్టీలను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టంది. చివరకు నరసింహయ్య కుమారుడు నోముల భగత్ కు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాలు దక్కించుకున్న టిఆర్ఎస్ అదే ఊపుతో సాగర్ లో ప్రచారం నిర్వహిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సాగర్ లో అమలు చేస్తోంది. ఎన్నికల బూత్‌ల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించి ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలకు ఆర్థిక బలం అంగ బలం అధికంగా ఉండడంతో ఎక్కడ వినబడకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రతి ఇరవై ఐదు మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్ పెట్టి వారితో నిత్యం టచ్‌లో ఉండేలా ఏర్పాటు చేశారు. ఎన్నికల నాటికి వారిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకువచ్చి ఓటు వేయించుకునేలా కసరత్తు చేస్తున్నారు.

ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు..

మరోవైపు సాగర్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదీష్ రెడ్డి పేర్ల ప్రకటించారు. ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ తప్ప నేతలంతా సాగర్‌లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ సాగర్లో రోడ్‌ షోలు నిర్వహిస్తారు అని తెలుస్తోంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచార చివరలో భారీ బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనలో గులాబీ వర్గం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని, బిజెపి అభ్యర్థి రవికుమార్ నాయక్‌ని ఓడించి రాష్ట్రంలో లో కాంగ్రెస్ బిజెపిల అస్తిత్వం లేదని నిరూపించే పనిలో ఉన్నారు గులాబీ బాస్. అందుకు అనువైన అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories