జడ్చర్లలో అన్నదమ్ముల మరణం: మరణంలోనూ విడదీయని బంధం

జడ్చర్లలో అన్నదమ్ముల మరణం: మరణంలోనూ విడదీయని బంధం
x

జడ్చర్లలో అన్నదమ్ముల మరణం: మరణంలోనూ విడదీయని బంధం

Highlights

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విషాదం అన్న మృతి తట్టుకోలేక తమ్ముడు మృతి అన్న మరణవార్తతో ఆగిన తమ్ముడి గుండె ఒక్క క్షణం తేడాతో అన్నదమ్ముల మృత్యువాత

వాళ్లిద్దరూ ఒక్క తల్లిపిల్లలు.. చిన్ననాటి నుంచి అన్నదమ్ములిద్దరికి ఒకరంటే మరొకరికి ప్రాణం. అన్నకు బాధ కలిగితే తమ్ముడు విలవిలాడేవాడు. తమ్ముడికి కష్టం వస్తే.. అన్న అల్లాడిపోయేవాడు. ఏ కష్టాన్నైనా... అన్నదమ్ములిద్దరూ కలిసి ఎదుర్కొనేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లారు.. చివరికి మరణంలోనూ ఆ అన్నదమ్ముల అనుబంధం వీడలేదు.. అన్న మరణ వార్త వినగానే తమ్ముడు హఠాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. వనపర్తిలో నివాసం ఉంటున్న నరసింహరావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. అది తెలిసిన తమ్ముడు గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యాడు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు చనిపోవడంతో విషాద ఛాయలు అలుమకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories