Heavy Rains: ఆంధ్రా- తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు

Traffic Stopped Between AP and Telangana Due To Heavy Rains
x

Heavy Rains: ఆంధ్రా- తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు

Highlights

Heavy Rains: రెండు రోజులుగా తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి.

Heavy Rains: రెండు రోజులుగా తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు అయిన రామాపురం క్రాస్ రోడ్ దగ్గర పాలేరు వాగు పొంగి వరద నీరు విజయవాడ, హైదరాబాదు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రా తెలంగాణకు వారధిగా ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు ఎన్టీఆర్ జిల్లా ఐతవరం దగ్గర కూడా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. 65వ జాతీయ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడ నుంచి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories