Traditional Trible Fest Rajul Panga: ఆదివాసీల సాంస్కృతిక సంప్రదాయం 'రాజుల్ పంగ'

Traditional Trible Fest Rajul Panga: ఆదివాసీల సాంస్కృతిక సంప్రదాయం రాజుల్ పంగ
x
Highlights

Rajul Pen Festival: ప్రకృతే దైవం. కల్మషం లేని జీవనం ఆదివాసీ వైవిధ్యానికి దర్పణం. ప్రతి చోట పాశ్చాత్య సంస్కృతి కనిపిస్తున్న నేటి ఆధునిక యుగంలో...

Rajul Pen Festival: ప్రకృతే దైవం. కల్మషం లేని జీవనం ఆదివాసీ వైవిధ్యానికి దర్పణం. ప్రతి చోట పాశ్చాత్య సంస్కృతి కనిపిస్తున్న నేటి ఆధునిక యుగంలో ఆదివాసీలు తమ సంప్రదాయాల్ని వదలకుండా జీవనం సాగిస్తున్నారు.

ఆదివాసుల ఆచార వ్యవహారాలే వేరు అడవి తల్లిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసే గిరిజనులు తొలకరి జల్లులు పడుతున్న సమయంలో విత్తనాలు సరిగ్గా మొలకెత్తాలని పశువులకు మేత దొరకాలన అడవిలోకి వెళ్లే తమకు, సాధు జంతువులకు క్రూరమృగాల వల్ల ఎలాంటి ప్రమాదం కలుగకూడదని రాజుల్‌ పేన్‌ పంగ నిర్వహింస్తారు.

పండగ మొదటి రోజు పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండవ రోజు రాజుల్ పేన్ పండుగ నిర్వహిస్తారు. రాజుల్ పేన్ దేవునికి ‌పసుపు, ‌కుంకుమతో ప్రత్యేకంగా పట్టు వేస్తారు. ఆ వేసిన పట్టుమీద నుండి పశువులను దాటిస్తారు దేవునికి కోళ్లు, మేకలు బలి ఇస్తారు.

అడవి దేవుడైనా రాజుల్ పేన్‌ను గిరిజనులు ఏళ్ల కాలం నుండి పూజిస్తారు. అడవి తల్లికి పూజలు నిర్వహించడం వల్ల తమకు అడవి తల్లి కరుణా కటాక్షాలు లభిస్తాయని గిరిజనుల నమ్మకం. అడవి తల్లిని శాంతి పరిస్తే తమకు శుభాలు కలుగుతాయని గిరిజనులు అంటున్నారు. పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని చెబుతున్నారు. తాత‌ముత్తాల కాలం నుండి వస్తున్నా ఈ పండుగను ఎంతో సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు. కొందరు గనుల కోసం, సంపద కోసం అడవులను ధ్వంసం చేస్తున్నారు కానీ ప్రాణకోటికి ఆధారమైన అడవులను పూజిస్తూ గిరిజనులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories