ఇవాళ చంచల్ గూడ జైలుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్

Revanth Reddy: జైళ్లో ఉన్న నిరసనకారుల కోసం కాంగ్రెస్ న్యాయపోరాటం

Jyothi
Published on: 24 Jun 2022 9:08 AM IST
TPCC President Revanth Went Chanchalguda Jail Today
X

ఇవాళ చంచల్ గూడ జైలుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ మరో పోరాటానికి దిగబోతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం ఘటనలో అరెస్ట్ అయిన వారి కోసం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. అగ్నిపథ్ నిరసనకారుల తరపున లీగల్ ఫైట్ కు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి పార్టీ ఆధ్వర్యంలో సుశిక్షితులైన న్యాయవాదులను నియమించనున్నారు.

కోర్టుల్లో నిరసనకారుల తరపున వాదనలు వినిపించేందుకు లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇవాళ చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైళ్లో ఉన్న నిరసనకారులతో ఆయన మాట్లాడనున్నారు. మరోవైపు న్యాయ సలహా కోసం గాంధీ భవన్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story