అసమర్థత, అవినీతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారుపేరు : ఉత్తమ్‌

అసమర్థత, అవినీతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారుపేరు : ఉత్తమ్‌
x
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. నగరంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, సీఎం కేసీఆర్‌‌కు కనీసం బాధితుల్ని పరామర్శించే తీరిక లేదా అని ప్రశ్నించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. నగరంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, సీఎం కేసీఆర్‌‌కు కనీసం బాధితుల్ని పరామర్శించే తీరిక లేదా అని ప్రశ్నించారు. వరద సాయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని విమర్శించారు. అసమర్థత, అవినీతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోపేరని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అర్థరాత్రి కాంగ్రెస్‌ నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలో చేరాలని ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని ఉత్తమ్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories