Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్

TPCC Chief  Revanth Reddy Arrest
x

 Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్

Highlights

Revanth Reddy: జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు రేవంత్‌ తరలింపు

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించేందుకు వెళ్తున్న రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రేవంత్‌ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు. వాటన్నింటినీ దాటుకొని బయటకు వచ్చిన రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి వరకు పోలీసులతో రేవంత్‌ చర్చలు జరిపారు. తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే పోలీసులు ఒప్పుకోకపోవడంతో రేవంత్‌ వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

పంచాయతీలకు నిధుల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ఆందోళనలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. సర్పంచ్ లు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనాలని సూచించింది. అయితే.. కాంగ్రెస్ ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు హస్తం నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొని హౌస్ అరెస్టులు చేశారు. మల్లు రవి, షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, వీహెచ్, అద్దంకి దయాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీరితో పాటు.. పలువురు కాంగ్రెస్‌ నేతలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్‌ వలయాన్ని దాటుకొని.. రేవంత్‌ ఇంటికి చేరుకునే ప్రయత్నం చేసింది కార్పొరేటర్‌ విజయారెడ్డి. అయితే.. విజయారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్పొరేటర్‌ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విజయారెడ్డిని అడ్డుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు గాంధీభవన్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీభవన్‌ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో గేట్లను నెట్టుకుంటేనే రోడ్లపైకి వచ్చారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories