కనువిందు చేస్తోన్న బొగత జలపాతం

కనువిందు చేస్తోన్న బొగత జలపాతం
x
Highlights

ములుగు జిల్లా వాజేడులో బొగత జలపాతం అందాల కనువిందు చేస్తోంది. బొగత అందాలను చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదు. పచ్చని అడవి తల్లి ఒడిలో జాలువారుతోన్న...

ములుగు జిల్లా వాజేడులో బొగత జలపాతం అందాల కనువిందు చేస్తోంది. బొగత అందాలను చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదు. పచ్చని అడవి తల్లి ఒడిలో జాలువారుతోన్న బొగత జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. బొగత అందాలను చూస్తూ పులకరించిపోతున్నారు. తెలంగాణ నయాగరాగా ఖ్యాతిగాంచిన బొగత జలపాతం కొండకోనల మధ్య అద్భుతంగా కనువిందు చేస్తోంది. గలగల శబ్దాలు చేస్తూ జాలువారుతోన్న బొగత అందాలను చూస్తూ పర్యాటకులు తన్మయత్వానికి లోనవుతున్నారు. ఆకాశం నుంచి జాలువారుతూ... దూదిపింజల్లా స్పృశించే అనుభూతి పొందుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం... ఇప్పుడు నీటి ప్రవాహం తగ్గడంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. రాళ్ల గుట్టల మీదుగా కిందకి జాలువారుతూ... అడవి అందానికే బొగత జలపాతం వన్నె తెస్తోంది. పచ్చని చెట్ల మధ్య పాలనురుగు ప్రవాహంతో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బొగత జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తోన్న పర్యాటకులతో బొగత జలపాతం దగ్గర జన జాతరను తలపిస్తోంది. కేవలం తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తున్నారు. పర్యాటకుల రాకతో కీకారణ్యం కాస్తా... జనారణ్యంలా మారింది.

బొగత జలపాతంలో స్నానాలు చేస్తూ ఫుల్‌‌గా ఎంజాయ్ చేస్తున్నారు. బొగత జలధారలు, తుంపర్ల మధ్య తడుస్తూ మంత్రముగ్ధులవుతున్నారు. 50 అడుగుల ఎత్తు పైనుంచి జాలువారుతోన్న బొగత అందాలను సెల్‌ఫోన్లలో బంధిస్తూ మధుర జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నారు. అలాగే సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. ఇక అక్కడే ఉన్న జిప్ సైక్లింగ్‌, జిప్ రైడింగ్‌లో పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories