Maoist Leader Devji Surrender: డీజీపీ ఎదుట లొంగుబాటు చేసిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

Maoist Leader Devji Surrender
x

Maoist Leader Devji Surrender: డీజీపీ ఎదుట లొంగుబాటు చేసిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

Highlights

Maoist Leader Devji Surrender: మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీతో పాటు మరో ముగ్గురు నేతలు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగుబాటు చేశారు. పోలీసుల ప్రకటనతో కీలక వివరాలు వెలుగు చూశాయి.

Maoist Leader Devji Surrender : మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శిగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా పోలీసుల సమక్షంలో లొంగుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీజీపీ శివధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసుల చర్యలు, ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ల ఫలితంగానే కీలక నేతల లొంగుబాటు సాధ్యమైందని పేర్కొన్నారు. లొంగుబాటు చేసిన వారిపై ప్రభుత్వ పునరావాస విధానాల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ఈ పరిణామం తెలంగాణలో మావోయిస్టు ఉద్యమంపై కీలక మలుపుగా భావిస్తున్నారు. భద్రతా సంస్థల సమన్వయం, నిరంతర నిఘా చర్యలతో కీలక నాయకత్వాన్ని ప్రధాన ధారలోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్య పరిణామంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.


తిపిరి తిరుపతి @ దేవ్ జి @రమేష్ @సంజీవ్...

అనారోగ్యాలతో కారణాలతొ రహస్య జీవితాన్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నాను...

నేను నమ్మిన సిద్ధాంతాన్ని కొనసాగిస్తాను..

ప్రజల సమస్యల పైన ఇక ముందు కూడా పోరాడుతాము..

అనవసరం చర్చలకు అపోహలకు దారి తీయడం ఇది సమయం కాదు

మీ ప్రశ్నలు అన్నింటికి సమాధానం తర్వాత మీడియం ముందుకు ఇంటర్వ్యూ ద్వారా తెలుపుతా..

రాజకీయ జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను..

మల్ల రాజి రెడ్డి...

ప్రజల కొరకు పనిచేస్తాం...

ప్రజాసంకల్ప హక్కుల కోసం పనిచేయటం కోసం చట్ట పరిధిలో పనిచేస్తాం...

అవకాశాలు మేరకు ప్రజలు వెనక పనిచేస్తాం...

మావోయిజం ఎప్పుడు కూడా ముగింపు కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది

మేము లొంగి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి..

ప్రభుత్వంతో చర్చించి మిగిలిన మావోయిస్టులకు ఏం సందేశం ఇవ్వాలనేది ఆలోచిస్తాం...

Show Full Article
Print Article
Next Story
More Stories