ధరణి సేవలు ప్రారంభం.. మద్దతు ధరల కోసం రైతుల డిమాండ్.. తెలంగాణ లోకల్ వార్తలు!

ధరణి సేవలు ప్రారంభం.. మద్దతు ధరల కోసం రైతుల డిమాండ్.. తెలంగాణ లోకల్  వార్తలు!
x
Highlights

తెలంగాణా వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను ప్రారంభించారు. హైదరాబాద్‌ మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందనున్నాయి.

తెలంగాణా వ్యాప్తంగా ధరణి సేవలు :

తెలంగాణా వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను ప్రారంభించారు. హైదరాబాద్‌ మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందనున్నాయి. ఇప్పటి వరకూ 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయి. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయి.బాధితులకు పరిహారం అందలేదు : ఎమ్మెల్యే రాజాసింగ్

వరద బాధితులకు 10వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందామనుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు నగరాన్ని అస్తవ్యస్తంగా మార్చారని మండిపడ్డారు. బాధితులకు పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పంచి టీఆర్‌ఎస్ నాయకులు బల్దియా ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపించారు.

వరద బాధితులకు ప్రభుత్వం అందించే నష్ట పరిహారం పదివేలు అందడం లేదు. దీంతో హైదరాబాద్‌లోని అంబర్పేట్ తహసిల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నాచేపట్టారు. దీంతో అంబర్పేట్ నుండి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. వరద బాధితులకు అందించే నష్టపరిహారం పక్కదారి పట్టిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నేతలు, అధికారులు కలిసి వరద బాధితులకు అందించవలసిన నష్టపరిహారం వాటాలు పంచుకున్నారని వారు ఆరోపించారు.మద్ధతు ధర కోసం రైతుల డిమాండ్..

సీఎం కేసీఆర్ చెప్పినట్టే సన్నరకం పండిచామని తమకు మద్ధతు ధర ప్రకటించాలని మెదక్‌ జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. శివంపేట మండల కేంద్రంలోని సొసైటీ భవనం ముందు హైవేపై రైతులు ధర్నాకు దిగారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగిందని అరకొరగా వచ్చిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైవేపై గంటపాటు రైతులు రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షునిగా జగన్మోహన్..

జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షునిగా తెలంగాణకు చెందిన జగన్మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 18 వ తేదిన నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కాగ...28 రాష్ట్రాలలో తెలంగాణకు చెందిన జగన్మోహన్ రావు ఒక్కరే నామినేషన్ వేశారు. నవంబర్‌ 1న అద్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఎయిర్‎పోర్టులో ఎర్రచందనం..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‎పోర్టులో ఎర్రచందనం పట్టుబడింది. అక్రమంగా దాదాపు ఆరు కిలోల ఎర్రచందనాన్ని బ్యాగులో తరలిస్తున్న వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సుడాన్ దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం నిందితుడిని శంషాబాద్ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.Show Full Article
Print Article
Next Story
More Stories