ఈరోజు టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే

Today Telangana Chief Minister KCR Birthday
x

తెలంగాణ చీఫ్ మినిస్టర్ కెసిఆర్ బర్త్ డే (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

ఇవాళ టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే. తమ నాయకుడి 67వ జన్మదినం సందర్భంగా టీఆర్ ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు...

ఇవాళ టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే. తమ నాయకుడి 67వ జన్మదినం సందర్భంగా టీఆర్ ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోటి వృక్షార్చన పేరుతో కేసీఆర్‌ పుట్టినరోజు ఫిబ్రవరి 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ తమ వంతు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

కేసీఆర్ పుట్టిన రోజు పురష్కరించుకుని హైదరాబాద్ లోని వివిధ ఆలయాల్లో టీఆర్ ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. బల్కంపేట ఎల్లమ్మ దేవికి బంగారు చీరను సమర్పించనున్నారు. దాతల సహకారంతో రెండున్నర కేజీల బంగారంతో రూపొందించిన చీరను అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బహుకరించనున్నారు.

మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌‌లు జ‌ల‌విహార్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్తానం, తెలంగాణా ఉద్యమ నేపధ్యంతో త్రీ డీ గ్రాఫిక్స్ తో రూపొందించిన 30 నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories