Budget Meeting: నేడు రెండో రోజు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు..

Today Second Day of the Telangana Budget Meeting
x

అసెంబ్లీ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Budget Meeting: జరగనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.

Budget Meeting: ఇవాళ రెండో రోజు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ నెల 18న సభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, 20 నుంచి 25 వరకు బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చ పూర్తిచేసి 26న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగింది. మధ్యలో సెలవు దినాలు పోగా.. మొత్తం పది రోజులపాటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి.

నేడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దివంగత మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్‌, నాయిని నర్సింహారెడ్డి, కట్టా వెంకటనర్సయ్య, కమతం రాంరెడ్డి, కె.మధుసూధన్‌రావు, దుగ్యాల శ్రీనివాస్‌రావు, చెంగల్‌ బాగన్న, కె.వీరారెడ్డిల మరణానికి సంతాపం తెలుపుతూ తీర్మానంపై సభ్యులు మాట్లాడనున్నారు.

17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సీఎం కేసీఆర్‌ సమాధానం ఉంటాయి. ప్రభుత్వం 18న ఉదయం 11.30 గంటలకు 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. 19వ తేదీ విరామం ఇచ్చి.. 20 నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చను చేపడతారు. 21న ఆదివారం విరామం ఇవ్వనున్నారు. 22న బడ్జెట్‌పై సాధారణ చర్చ, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 23న వివిధ శాఖల పద్దులపై చర్చ ప్రారంభమై.. 25న ముగియనుంది. 26న ద్రవ్యవినిమయ బిల్లులను ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories