CWC Meeting: ఇవాళ తాజ్ కృష్ణలో రెండోరోజు cwc సమావేశాలు.. హాజరుకానున్న 147 మంది సభ్యులు

Today Is The Second Day Of CWC Meeting At Taj Krishna
x

CWC Meeting: ఇవాళ తాజ్ కృష్ణలో రెండోరోజు cwc సమావేశాలు.. హాజరుకానున్న 147 మంది సభ్యులు

Highlights

CWC Meeting: వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై క్యాడర్‌కు అగ్రనేతల దిశానిర్దేశం

CWC Meeting: హైదరాబాద్ వేదికగా రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు కొనసాగనున్నాయి. తాజ్ కృష్ణలో ఇవాళ రెండో రోజు భేటీకానున్న సీడబ్ల్యూసీ సభ్యులు. ఉదయం పదిన్నర గంటలకు భారత్ జోడో హాల్‌లో సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీకి 147 మంది సభ్యులు హాజరుకానున్నారు. విస్తృతస్థాయి భేటీలో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, ఆఫీస్ బేరర్లు, 4 రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.

నిన్న జరిగిన సమావేశంలో జాతీయ స్థాయి అంశాలపై ప్రధానంగా చర్చించారు. బీజేపీ వైఖరి, మోడీ పని తీరు, ఇండియా కూటమి, మణిపూర్ అంశం, చైనా, ఆర్థిక అంశాలు, నిరుద్యోగం ఆర్థిక అంశాలపై ప్రధాన చర్చ జరిపారు. ఇవాళ జరగనున్న సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహం, పార్లమెంట్ ఎన్నికలు, ఇండియా కూటమిలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలపై చర్చించనున్నారు.వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు అగ్రనేతలు.

సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు తుక్కుగూడ బహిరంగ సభ ప్రాంగణానికి బస్సుల్లో మెగా ర్యాలీగా బయలుదేరనున్నారు అగ్రనేతలు. సాయంత్రం 6 గంటలకు విజయభేరి సభ ప్రాంగణానికి మెగా బస్సు ర్యాలీ చేరుకుంటుంది. ఈ భారీ బహిరంగ సభను 10 లక్షల మందితో నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఒకే వేదికపై సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, 4 రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. సభలో ఆరు గ్యారంటీ స్కీమ్స్, బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నారు సోనియాగాంధీ.

Show Full Article
Print Article
Next Story
More Stories