TS BJP: ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే చాన్స్‌

Today Is The Chance To Release The First List Of Telangana BJP Candidates
x

TS BJP: ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే చాన్స్‌

Highlights

TS BJP: జాబితాలో బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యత

TS BJP: ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. సీఈసీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో అభ్యర్థుల ఎంపికపై కోర్ గ్రూప్ కసరత్తు చేసింది. దాదాపు 60 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదలయ్యే అవకాశముంది. బీసీలకు, మహిళలకు ఎక్కువ టికెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు.. ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం.

ఇక.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్..ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో ఉండనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories